బికినీలో పీవీ సింధు.. బ్యాడ్మింటన్ స్టార్ ఫొటోలు వైరల్! ఒక మంచి బ్రేక్ కావాలి..
Mon Jun 09, 2025 16:00 Sports
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ప్రస్తుతం వియత్నంలోని అమనోయిలో తన భర్తతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. అయితే, తాజాగా ఈ బ్యాడ్మింటన్ స్టార్ బికినీలో మెరిసింది. ఆ సమయంలో తీసిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఒక మంచి బ్రేక్ కావాలి.. అంటూ ఈ పోస్ట్‌లో ఆమె రాసుకొచ్చింది. దీంతో సింధు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే, అభిమానులు, మీడియా వర్గాల్లో ఈ చిత్రాలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా ఆట పరంగా సింధు వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ ఫొటోలు బయటకు రావడం గమనార్హం. ఇటీవలి కాలంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న విషయం తెలిసిందే. మలేషియా మాస్టర్స్ టోర్నమెంట్‌లో ఆమె తొలి రౌండ్‌లోనే ఓటమి పాలై నిష్క్రమించింది. ఆ తర్వాత జరిగిన ఇండోనేషియా ఓపెన్‌లో కూడా, సునాయాసంగా గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో ఓడిపోయి, రెండో రౌండ్‌లోనే ఇంటి దారి పట్టింది. ఇక, ఈ ఏడాది జనవరిలో ప్రఖ్యాత స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ ప్యూమాకు సింధు కొత్త అంబాసిడర్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. 2025 బ్యాడ్మింటన్ ఇండియా ఓపెన్‌లో ప్యూమా బ్రాండ్‌తో కోర్టులోకి అడుగుపెట్టడమే కాకుండా, ఫ్యాషన్ రంగంలోనూ తనదైన ముద్ర వేసింది. ఈ భాగస్వామ్యం ద్వారా బ్యాడ్మింటన్ కోర్టు ఆవల కూడా సింధు తన బ్రాండ్ ఇమేజ్‌ను విస్తరించుకుంది.
ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు! మొదటి దశకు సుమారు..
జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..
కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..
సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!
పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..
జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!
ఆ 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!
అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!
ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!
షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!
రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!
గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!
బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #PV Sindhu #PV Sindhu bikini photos #Sindhu vacation #Amanoi Vietnam #badminton player #Puma brand #ambassador Malaysia Masters #Indonesia Open #sports wear brand
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.